మహారాష్ట్రలోని నాలాసోపారా ప్రాంతంలో బర్త్ డే వేడుకల కోసం తెచ్చిన కేక్‌లో చనిపోయిన బల్లి కనిపించడంతో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. ఆ కేక్ తిన్న కుటుంబ సభ్యులు, బంధువులు కలిపి మొత్తం 11 మంది తీవ్ర అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు. వాంతులు, కడుపునొప్పితో ఆసుపత్రిలో చేరిన బాధితులకు వైద్యులు తక్షణమే చికిత్స అందించారు. ప్రస్తుతం బాధితులంతా క్షేమంగా ఉన్నారని, ప్రమాదం తప్పిందని వైద్యులు స్పష్టం చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.
0 Comments