Ad Code

అమెరికాలో షాపింగ్ మాల్‌లో హైదరాబాద్‌ యువకుడిపై కత్తితో దాడి చేసిన దుండగుడు

మెరికాలోని ఓ షాపింగ్ మాల్‌లో హైదరాబాద్‌ యువకుడిపై కత్తితో దాడితో చేశారు. హైదరాబాద్‌ టౌలిచౌకికి చెందిన సయ్యద్‌ సోహైల్‌పై ఓ దుండగుడు 15సార్లు కత్తితో దాడి చేశాడు. దాడి ఘటన జులై 13న జరగ్గా.. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తీవ్రంగా గాయపడిన సయ్యద్‌ సోహైల్‌ వెస్ట్ వ్యాలీ సిటీలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్లు అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.  గత రెండున్నరేళ్లుగా సోహైల్‌ షాపింగ్ మాల్‌లో చిన్న వ్యాపార దుకాణం నిర్వహిస్తున్నాడు. పోలీసులు అక్కడికి చేరుకోకముందే, మాల్‌లోని కొందరు వ్యక్తులు దాడి చేసిన వ్యక్తిని నిలువరించి, అతని చేతిలోని కత్తిని లాక్కున్నారు. నిందితుడిని పీటర్ మైఖేల్ లార్సెన్‌గా గుర్తించారు. ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకోవాలని సోహైల్‌ కుటుంబ సభ్యులు భారత ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌కు విన్నవిస్తూ.. ఈ సమస్యను అమెరికా అధికారుల దృష్టికి తీసుకెళ్లి.. తాము అమెరికా వెళ్లేందుకు అవసరమైన వీసాలను ఏర్పాటు చేయాలని కోరారు. ఈ దాడి గురించి తెలిసి సోహైల్‌ భార్య అమ్రీన్ ఫిర్దౌస్ స్పృహతప్పి పడిపోయారు. ఈ దంపతులకు ఐదేళ్లు, మూడేళ్ల వయసున్న ఇద్దరు పిల్లలు ఉన్నారు.

Post a Comment

0 Comments

Close Menu