ప్రభాస్ 'ఫౌజీ' షూటింగ్ లో బాలీవుడ్ నటుడు రాజేష్ శర్మని విషపురుగు కుట్టింది. దీంతో ఆ నటుడి పరిస్థితి విషమంగా మారింది. జ్వరం, తీవ్రమైన నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం కోల్‌కాతాలో డాక్టర్లు అత్యవసర చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. తొలుత సాధారణ పురుగేనని నిర్లక్ష్యం చేయగా, 6 గంటల తర్వాత లక్షణాలు కనిపించాయని సినీ వర్గాలు తెలిపాయి. హైదరాబాద్ నుంచి కోల్‌కాతాకు వెళ్తుండగా ఫ్లైట్లో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడినట్లు తెలుస్తుంది.
0 Comments