బెల్జియంలోని ఆంట్‌వెర్ప్ అనే పోర్ట్ సిటీలో పదంతస్తులున్న ఒక రెసిడెన్షియల్ బిల్డింగులో మంటలు చెలరేగడంతో ఆరుగురు మరణించారు. మరికొందరు మంటల్లో చిక్కుకున్నారు. ఈ బిల్డింగులో దాదాపు 200 మందికిపైగా నివసిస్తున్నారు. ఎనిమిదో ఫ్లోర్‌లో మొదలైన మంటలు నెమ్మదిగా ఇతర ఫ్లోర్లకు వ్యాపించాయి. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే స్మోక్ డిటెక్టర్స్ పనిచేసి, అలారంలు మోగాయి. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు. బిల్డింగులో చిక్కుకున్నవారిని యుద్ద ప్రాతిపదికన రక్షించే చర్యలు చేపట్టారు. పక్కనున్న బిల్డింగ్ నుంచి తాడు ద్వారా సహాయక బృందాలు ప్రమాదం జరిగిన బిల్డింగులోకి వెళ్లాయి. . స్పెషలైజ్డ్ డ్రోన్లను కూడా వాడుతున్నారు. అగ్నిప్రమాదం కారణంగా చాలా మంది మంటల్లోనే చిక్కుకుపోయారు. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఆరుగురు మరణించినట్లు అధికారులు ప్రకటించారు. మరికొందరు గాయపడ్డారు. వారిని దగ్గర్లోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మంటల్లో చిక్కుకున్న మిగతావారికోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటలు భారీగా వ్యాపించడంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోంది. పొగ భారీగా వ్యాపించడంతో ముందు జాగ్రత్తగా సూచనలు చేశారు. చుట్టుపక్కల నివసించే వారు తమ కిటికీలు, వెంటిలేషన్ మూసేసుకోవాల్సిందిగా అధికారులు సూచించారు.
0 Comments