హైదరాబాద్‌లో నివసిస్తున్న పియూష్ అనే యువకుడికి, ఫేస్‌బుక్‌లో 'నిషా కుమార్' మరియు ఇన్‌స్టాగ్రామ్‌లో 'పూనమ్' అనే ఫేక్ ఐడిలతో చందన్ కుమార్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను అమ్మాయినని నమ్మించి, పియూష్‌తో చందన్ దగ్గరయ్యాడు. చివరికి పియూష్ అతడిని తన భార్యగా అంగీకరించి, ఆమెను పెళ్లి చేసుకున్నాడు. ఒకరోజు చందన్ షేవింగ్ చేసుకోవడం చూసిన పియూష్ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. తాను పెళ్లి చేసుకున్నది అమ్మాయిని కాదు, ఒక పురుషుడని తెలిసి పియూష్ కుప్పకూలిపోయాడు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ వివాదం హైదరాబాద్ నుండి ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ మీదుగా చివరికి గుజరాత్‌లోని రాజ్‌కోట్ వరకు కొనసాగింది. జూన్ 21న రాజ్‌కోట్‌లోని ఒక కర్మాగారంలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. కోపంతో ఊగిపోయిన పియూష్, చందన్‌ను రైల్వే ట్రాక్ సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి, పెద్ద బండరాళ్లతో తలపైన, శరీరంపై బలంగా కొట్టి చంపేశాడు. చందన్ మృతదేహంపై బట్టలు మార్చి, మహిళా దుస్తులు ధరింపజేసి, ఎవరికీ అనుమానం రాకుండా రాళ్లతో కప్పేశాడు. మరుసటి రోజు పియూష్ సాధారణంగా తన పనికి వెళ్ళిపోయాడు. జూన్ 25న మృతదేహం బయటపడటంతో, పోలీసులు సీసీటీవీ ఫుటేజీలు మరియు సాంకేతిక ఆధారాల ద్వారా విచారణ జరిపి, 20 ఏళ్ల పియూష్ కుమార్ ఖర్వార్‌ను అరెస్ట్ చేశారు. నిందితుడు తన నేరాన్ని అంగీకరించాడు. ప్రస్తుతం నిందితుడిపై భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 103(1) కింద హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
0 Comments