అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ధరలు మళ్లీ భారీగా తగ్గాయి. స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు 46 డాలర్ల మేర దిగివచ్చింది. దీంతో ఔన్స్ బంగారం ధర 4133 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇక స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 2.13 శాతం మేర పడిపోయింది. దీంతో ఔన్స్ వెండి రేటు 61 డాలర్ల వద్దకు దిగివచ్చింది. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. ఈరోజు 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 110 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ. 1,46,620 వద్దకు దిగివచ్చింది. 22 క్యారెట్ల ఆభరణాల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 100 మేర తగ్గింది. దీంతో తులం రేటు రూ. 1,34,400 వద్ద ట్రేడవుతోంది. బంగారంతో పాటు వెండి ధర సైతం భారీగా తగ్గింది. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కిలో వెండి రేటు రూ. 10 వేల మేర తగ్గింది. దీంతో కిలో సిల్వర్ రేటు రూ. 2,50,000 మార్క్ వద్దకు దిగివచ్చింది.
0 Comments