Ad Code

ఎస్ జానకి అంత్యక్రియలను ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించిన కర్ణాటక ప్రభుత్వం

గాన కోకిల ఎస్ జానకి అంత్యక్రియలను పూర్తి ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది. మైసూరులోని మహారాజా కాలేజీ మైదానంలో ఆమె పార్థివదేహాన్ని అభిమానుల కడసారి సందర్శనార్థం ఉంచారు. కడసారి చూపు కోసం లక్షలాదిమంది అభిమానులు మైసూరుకు తరలివస్తోన్నారు. కన్నీటి నివాళి అర్పిస్తోన్నారు. అంత్యక్రియలను మైసూరు జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డాక్టర్ ఎస్ యతీంద్ర పర్యవేక్షిస్తోన్నారు. జానకమ్మకు వీడ్కోలు పలికేందుకు ప్రతీ ఒక్కరికీ అవకాశం కల్పిస్తూ ఏర్పాట్లు చేశారు. ఆమె అంత్యక్రియలు మైసూరు సమీపంలోని కణియనహుండి గ్రామంలో జరుగనున్నాయి. జానకమ్మ తన శేష జీవితాన్ని ఇక్కడే గడపారు. ఇందుకోసం ఆమె స్వయంగా అక్కడ రెండెకరాలను కూడా కొనుగోలు చేశారు. ఇక్కడ ఇళ్లు కట్టుకోవాలని ఆశించారు. ఆమె కోరిక మేరకే అదే ఇంటి స్థలంలో అంత్యక్రియలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అంత్యక్రియల సమయంలో ఎలాంటి గందరగోళ పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు సుమారు 200 మంది పోలీసు సిబ్బందిని, రెండు కేఎస్ఆర్‌పీ బలగాలను నియమించినట్లు మైసూరు జిల్లా ఎస్పీ మల్లికార్జున బలదండి స్పష్టం చేశారు. పార్థివదేహాన్ని దర్శించుకోవడానికి వచ్చే వీఐపీల వాహనాల, సాధారణ ప్రజల రద్దీని నియంత్రించడానికి ప్రత్యేకంగా ట్రాఫిక్ రూట్ మ్యాప్‌లను సిద్ధం చేశారు.

Post a Comment

0 Comments

Close Menu