సికింద్రాబాద్‌లోని రాణిగంజ్‌లో టీవీ కార్యక్రమంలో పాల్గొనేలా చేస్తామంటూ నమ్మించి మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన ఒక 43 ఏళ్ల మహిళకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. అయితే, గత రెండేళ్లుగా అదనపు వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తుండటంతో మనస్పర్థలు వచ్చి ఆమె భర్తకు దూరంగా ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో, కుటుంబ సమస్యలను పరిష్కరించే ఒక ప్రముఖ టీవీ ఛానల్ రియాలిటీ షోలో పాల్గొని, తన గోడు వెళ్లబోసుకుంటే న్యాయం జరుగుతుందని భావించి ఆమె హైదరాబాద్‌కు వచ్చింది. బాధితురాలు నగరంలో ఉన్న సమయంలో ఒక వ్యక్తి ఆమెకు పరిచయమయ్యాడు. సదరు టీవీ షో నిర్వాహకులు తనకు బాగా తెలుసని, ఆమెకు త్వరగా అవకాశం వచ్చేలా సహాయం చేస్తానని నమ్మబలికాడు. అతని మాటలను నిజమేనని నమ్మిన ఆ మహిళను నిందితుడు సికింద్రాబాద్ రాణిగంజ్‌లోని హైదర్ కాంప్లెక్స్‌కు తీసుకువెళ్లాడు. అక్కడ జనసంచారం లేని సమయం చూసి, ఆ వ్యక్తి మహిళపై బలవంతంగా అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగకుండా, ఆ తర్వాత అక్కడికి వచ్చిన అతని స్నేహితుడు కూడా ఆమెపై లైంగిక దాడికి ఒడిగట్టాడు. ఊహించని ఈ దారుణంతో తీవ్ర దిగ్భ్రాంతికి, భయానికి గురైన బాధితురాలు గట్టిగా కేకలు వేయడంతో నిందితులిద్దరూ అక్కడి నుంచి పరారయ్యారు. జరిగిన ఘోరంపై బాధితురాలు స్థానిక మహంకాళి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు తక్షణమే రంగంలోకి దిగారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి, సాంకేతిక ఆధారాల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టి, నిందితులిద్దరినీ కొన్ని గంటల్లోనే అదుపులోకి తీసుకున్నారు. నిందితులపై కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
0 Comments