Ad Code

ఢిల్లీలో వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు శీతాకాలంలో నిర్మాణ పనులకు అనుమతి నిరాకరణ

శీతాకాల కాలుష్య మాస్టర్ ప్లాన్‌ శాశ్వత నిబంధనలలో భాగంగా నవంబర్ 1 2026 నుండి ఫిబ్రవరి 28, 2027 వరకు రాజధాని పరిసరాల్లో నిర్మాణ పనులకు ఢిల్లీ ప్రభుత్వం అనుమతి నిరాకరించనున్నట్లు తెలిపింది. అదేవిధంగా నవంబర్ 1 నుండి జనవరి 31వరకు ఢిల్లీలో కూల్చివేతలు, సివిల్ నిర్మాణ కార్యకలాపాలపై నిషేధం, ప్రభుత్వ కార్యాలయాల అధికారులకు 50 శాతం వర్క్ ఫ్రమ్ హోమ్, పీయూసీ సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధనం నిరాకరణ తదితర చర్యలు చేపట్టనున్నట్లు తెలిపింది. పార్కింగ్ ఛార్జీల రెట్టింపు సైతం నవంబర్‌ 1 నుండి అమలులోకి వస్తాయని తెలిపింది. శీతాకాల కాలుష్య మాస్టర్ ప్లాన్‌ శాశ్వత నిబంధనలను ఢిల్లీ ప్రభుత్వం నోటిఫై చేసింది. ఢిల్లీని పరిశుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ప్రజలు భాగస్వామ్యం వహించాలని ఈ సందర్భంగా ఆ రాష్ట్ర సీఎం రేఖా గుప్తా పిలుపునిచ్చారు.

Post a Comment

0 Comments

Close Menu