అమెరికా తన హామీల నుంచి లేదా ఒప్పందాల నుంచి వెనక్కి తగ్గితే ఇరాన్ చూస్తూ ఊరుకోదని, దానికి బదులుగా అమెరికా తీసుకునే ఏ చర్యకైనా తగిన రీతిలో దీటుగా స్పందిస్తుందని ఆ ప్రకటన స్పష్టం చేసింది. అదే సమయంలో, అమెరికాతో చర్చలను కొనసాగించాలని టెహ్రాన్ కోరిందన్న ట్రంప్ వాదనను ఇరాన్ మంత్రిత్వ శాఖ తోసిపుచ్చింది. అమెరికాతో చర్చల కోసం తాము అభ్యర్థించలేదని, అయితే ఖతార్ మధ్యవర్తుల ఇరాన్ పర్యటనను మాత్రం అంగీకరించామని ఇరాన్ విదేశాంగ శాఖ పేర్కొంది. అమెరికాతో యుద్ధం జరిగితే అది ఇరాన్ లొంగుబాటుతో ముగియదని, తమను తాము రక్షించుకోవడానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని ఇరాన్ ప్రతినిధి మహమ్మద్ బాఘర్ ఘలిబాఫ్ పేర్కొన్నారు. యుద్ధాన్ని ముగించడం ప్రపంచ దేశాలకు అత్యంత ప్రాధాన్యత కలిగిన అంశం, కానీ ఈ ఘర్షణ ఇరాన్ లొంగిపోవడంతో ఎప్పటికీ ముగియదని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి. అమెరికన్లు ఎప్పుడు ఒప్పందాన్ని ఉల్లంఘించినా.. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి మేము పూర్తిగా సిద్ధంగా ఉంటాము.. మేము వారికి ధృడంగా ఎదురునిలిచి, ఇరాన్ ప్రజల హక్కులను కాపాడుతామని ఘలిబాఫ్ అన్నారు. అమెరికాతో జరిగిన చర్చల సందర్భంగా ఆ దేశ ఉపాధ్యక్షుడు జె.డి. వాన్స్‌కు.. తమకు అమెరికాపై నమ్మకం లేదని స్పష్టం చేసినట్లు కూడా ఘలిబాఫ్ పేర్కొన్నారు. నా దృష్టిలో, యుద్ధానికి సిద్ధంగా ఉన్నవారు మాత్రమే అమెరికాతో చర్చలు జరపగలరు. అమెరికాతో జరిపే చర్చలు శాంతి చర్చలు కావంటూ ఘలిబాఫ్ చేసిన వ్యాఖ్యలకు.. ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు రుహోల్లా ఖొమేనీ మనవడైన అలీ ఖొమేనీ మద్దతు తెలిపారు. ఇస్లామిక్ రిపబ్లిక్ చర్చల గురించి మాట్లాడటం మీరు చూస్తే, అవి శాంతి చర్చలు కావని గ్రహించండి. నేరపూరిత అమెరికాతో మనం శాంతిని నెలకొల్పగలమా? అహంకారంతో రాజీ పడకపోవడమే మన గుర్తింపు.. చర్చలంటే యుద్ధమే, ఆ యుద్ధం అనేక రూపాల్లో ఉంటుంది. అమెరికాతో శాంతి చర్చలు జరపాలని కోరుకునేవాడు దేశద్రోహి.. అమెరికాకు స్నేహపూర్వక సందేశాన్ని పంపేవాడి నోరు అపవిత్రమైనది.. మురికితో కూడినదని అన్నారు.
0 Comments