Ad Code

పోలీసులపై దొంగ కత్తితో దాడి : దొంగపై కాల్పులు జరిపిన పోలీసులు : తీవ్రంగా గాయపడిన దొంగ

తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని ఆదిభట్లలో పోలీసులపై దొంగ కత్తితో దాడిచేయడంతో అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం భూష్మి శ్రీకాంత్ అనే దొంగ నల్లగొండ జిల్లాలోని వివిధ ప్రాంతాలలో దొంగతనాలు చేశాడు. శ్రీకాంత్ ఆదిభట్లలో ఉన్నాడని తెలియడంతో నల్లగొండ సీసీఎస్ పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఓఆర్‌ఆర్‌పై ఎగ్జిట్ నెంబర్ 12 దగ్గర నిందితుడు కనిపించడంతో పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నించారు. సీసీఎస్ పోలీసులపై దొంగ కత్తితో దాడి చేయడం జరిగింది. ఆత్మ రక్షణకై పోలీసులు గాల్లోకి మూడు రౌండ్లు, తదనంతరం కంట్రోల్ కోసం కాళ్లపై ఫైర్ చేయడం జరిగింది. కాళ్లలోకి బుల్లెట్లు దిగడంతో అతడు తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతడిని వనస్థలిపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నల్లగొండ, ఎపిలో అతడిపై పలు పోలీస్ స్టేషన్లలో వందకు పైగా కేసులు ఉన్నట్టు సమాచారం. మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ అని పోలీసులు తెలిపారు. సిసిఎస్ హెడ్ కానిస్టేబుల్ కు తలకు గాయమైనట్టు సమాచారం.

Post a Comment

0 Comments

Close Menu