Ad Code

షార్ట్ సర్క్యూట్ కారణంగా పెంకుటిల్లు దగ్ధం

ఆంధ్రప్రదేశ్ లోని ఏలూరు జిల్లావేలేరు పాడు మండల కేంద్రంలోని బుధవారం తెల్లవారుజామున షార్ట్ సర్క్యూట్ కారణంగా పెంకుటిల్లు దగ్ధమైన సంఘటన చోటుచేసుకుంది. మండల కేంద్రంలోని ఐ టిడిపి వేలేరుపాడు మండల కార్యదర్శి ఎండీ నకీమ్ ఇంట్లో బుధవారం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు వ్యాపించడంతో పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లో ఉన్న విలువైన వస్తువులు, ఇంట్లో ఉన్న బీరువాలోని రెండు లక్షలు నగదు, లక్షన్నర విలువ బంగారు ఆభరణాలు, ఫర్నిచర్ మొత్తం కాలి బూడిదగా మారాయి. వాటి అంచనిత విలువ సుమారు 5 లక్షల పైనే ఉంటుందని బాధితులు తెలిపారు. ఈ ఘటనతో కుటుంబం తీవ్రంగా నష్టపోయిందని, ప్రభుత్వం తరఫున ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

Post a Comment

0 Comments

Close Menu