Ad Code

ఫిఫా నిర్వాహకులపై సంచలన ఆరోపణలు చేసిన ఈజిప్ట్ హెడ్ కోచ్ హోసామ్ హసన్

ర్జెంటీనా స్టార్ లియోనెల్ మెస్సీ కోసం ఫిఫా అంపైర్లకు తమకు అన్యాయం చేశారని ఈజిప్ట్ హెడ్ కోచ్ హోసామ్ హసన్ తెలిపాడు. మంగళవారం రాత్రి జరిగిన ఈ ప్రిక్వార్టర్ మ్యాచ్‌లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్ట్‌ను ఓడించింది. అయితే ఈజిప్ట్ ప్లేయర్ జికో 59వ నిమిషంలో గోల్ కొట్టినప్పటికీ.. దానిని ఫౌల్‌గా ప్రకటించడం తీవ్ర దుమారం రేపింది. మ్యాచ్ ముగిసిన తర్వాత.. మీడియా సమావేశంలో ఈ నిర్ణయాన్ని ప్రస్తావిస్తూ ఈజిప్ట్ కోచ్ హోసామ్ హసన్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ ఓటమిని దురదృష్టం అని సాదాసీదాగా చెప్పదలుచుకోలేదు. ఈ రోజు మమ్మల్ని దారుణంగా మోసం చేశారు. మాకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎలాంటి పరిణామాలు ఎదురైనా నేను నిజమే మాట్లాడతాను. ఇది స్పష్టంగా ఒక రిగ్గింగ్ మ్యాచ్. ఈ అన్యాయాన్ని ప్రపంచమంతా చూసింది. ఒకవేళ అర్జెంటీనానే గెలవాలని వాళ్లు అంతగా కోరుకుంటే మిగతా జట్లను ఎందుకు పిలిచారు. ముస్తఫా జికో చేసిన గోల్‌ను వీఏఆర్ ద్వారా ఫౌల్‌గా ప్రకటించారు. అర్జెంటీనా ప్లేయర్ అలెక్సిస్ మెక్ అలిస్టర్.. ఈజిప్ట్ ప్లేయర్ హమ్దీ ఫాతి జెర్సీని వెనక్కి లాగినా.. మ్యాచ్ రిఫరీలు కనీసం వీఏఆర్ రివ్యూ కూడా చూడకుండా పెనాల్టీ అప్పీల్‌ను తిరస్కరించారు. మా ఆటగాళ్ల తప్పిదాల వల్ల గోల్స్ వచ్చినా.. మ్యాచ్ బాధ్యతలు చూసే అధికారుల నుంచి మాకు దక్కాల్సిన న్యాయం దక్కలేదు. నేను ఓటమిని అస్సలు తట్టుకోలేను. ఇలాంటి అన్యాయమైన ఓటమి ఎదురైనప్పుడు అభిమానులను బాధపడొద్దని మాత్రమే చెప్పగలను. ఈ అన్యాయానికి నిరసనగా ఈ ప్రపంచకప్‌లో మిగిలిన మ్యాచ్‌లను చూడను. ఇదే నా నిరసన.'అని హసన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

Post a Comment

0 Comments

Close Menu