దినపత్రికలలో ప్రచురితమైన, శీర్షికల వార్తల ఆధారంగా నాగర్‌కర్నూలు జిల్లా, అమ్రాబాద్ మండలం, మన్ననూర్ గ్రామంలోని ప్రాజెక్టు గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో 26-27 మంది విద్యార్థులు అల్పాహారం తీసుకున్న అనంతరం అస్వస్థతకు గురైన ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. ఘటనకు దారితీసిన పరిస్థితులు, బాధిత విద్యార్థుల ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి, విచారణ నివేదిక, ఆహారం మరియు తాగునీటి నమూనాల పరీక్ష ఫలితాలు, బాధ్యులపై తీసుకున్న చర్యలు, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేపట్టిన నివారణ చర్యలపై సమగ్ర నివేదికను సమర్పించాలని నాగర్‌కర్నూలు జిల్లా కలెక్టర్‌ను కమిషన్ ఆదేశించింది.
0 Comments