ప్రముఖ బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ సహ-స్థాపించిన 'ABD మాస్ట్రో' సంస్థ తెలంగాణ మార్కెట్లోకి మూడు సూపర్-ప్రీమియం విస్కీలను విడుదల చేసింది. అలైడ్ బ్లెండర్స్ అండ్ డిస్టిలర్స్ లిమిటెడ్ (ABD) అనుబంధ లగ్జరీ విభాగమైన ఈ సంస్థ.. అంతర్జాతీయంగా అవార్డులు గెలుచుకున్న ‘AODH ఐరిష్ విస్కీ’, ‘WOODBURNS కాంటెంపరరీ రేర్ ఇండియన్ విస్కీ’, మరియు ‘YELLO డిజైనర్ విస్కీ’లను హైదరాబాద్ వ్యాప్తంగా అందుబాటులోకి తెచ్చింది. ఇందులో మూడు సార్లు స్వేదనం చేసిన సున్నితమైన రుచి గల AODH క్లాసిక్ ఐరిష్ విస్కీతో పాటు, 2025 ప్రతిష్టాత్మక ‘కాంకోర్స్ మాండియల్ డి బ్రస్సెల్స్’ ఈవెంట్‌లో 'గ్రాండ్ గోల్డ్' గెలుచుకున్న తొలి దేశీయ విస్కీగా చరిత్ర సృష్టించిన 'WOODBURNS' ఇక్కడి కస్టమర్లను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. అదేవిధంగా స్కాచ్ మరియు ఇండియన్ మాల్ట్‌ల అద్భుత సమ్మేళనంతో రూపుదిద్దుకున్న YELLO డిజైనర్ విస్కీ కూడా సరికొత్త అనుభూతిని అందించనుంది. హైదరాబాద్‌లో శరవేగంగా విస్తరిస్తున్న పబ్స్, లగ్జరీ రెస్టారెంట్లు మరియు కాస్మోపాలిటన్ యువత అభిరుచులకు అనుగుణంగా ఈ లగ్జరీ బ్రాండ్‌లను ప్రవేశపెట్టినట్లు ABD మాస్ట్రో ఎండీ విక్రమ్ బసు వెల్లడించారు. నాణ్యమైన బ్రాండ్‌లను ఇష్టపడే హైదరాబాద్‌తో పాటు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి నగరాల్లోనూ ఈ ప్రీమియం విస్కీలకు గట్టి ఆదరణ లభిస్తుందని సంస్థ భావిస్తోంది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రముఖ రిటైల్ లిక్కర్ అవుట్‌లెట్లు, ఎంపిక చేసిన లగ్జరీ బార్లలో ఇవి లభించనున్నాయి. ఈ మూడు స్పిరిట్స్‌కు సంబంధించిన 750 మి.లీ. బాటిల్ ధరల వివరాలను చూస్తే.. AODH ఐరిష్ విస్కీ ధరను ₹3,470గా, WOODBURNS కాంటెంపరరీ రేర్ ఇండియన్ విస్కీ ధరను ₹2,630గా, మరియు YELLO డిజైనర్ విస్కీ ధరను Rs.2,500గా సంస్థ నిర్ణయించింది.
0 Comments