బీహార్‌లోని గయా-పట్నా ప్రధాన రైల్వే మార్గంలోని తేహ్‌తా-జెహానాబాద్ స్టేషన్ల మధ్య సుమారు 100 మీటర్ల పొడవుగల 25 వేల ఓల్టుల ఓవర్‌హెడ్ ఎలక్ట్రిక్ వైర్‌ను కత్తిరించి ఎత్తుకెళ్లారు. దీంతో గురువారం తెల్లవారుజామున సుమారు మూడు గంటలపాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం తెల్లవారుజామున 3:05 గంటల సమయంలో ఈ చోరీ జరిగింది. దీంతో గయా-పట్నా మార్గంలో రైళ్ల రాకపోకలు ప్రభావితమయ్యాయి. మరమ్మతులు పూర్తయ్యేవరకు రైళ్లను సింగిల్ లైన్ వర్కింగ్ ద్వారా నడిపించారు. రైల్వే సిబ్బంది ఓహెచ్‌ఈ వ్యవస్థకు మరమ్మతులు చేపట్టిన అనంతరం ఉదయం 6:26 గంటలకు మార్గాన్ని పునరుద్ధరించారు. ఈ ఘటనకు సంబంధించి రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ చోరీకి గురైన వైర్‌ను స్వాధీనం చేసుకుంది. సదరు నిందితులను పట్టుకునేందుకు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు.
0 Comments