Ad Code

25 శాతం ఐబీఎం షేర్లు ఢమాల్ : 58 ఏళ్లలో షేర్లు ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి

బీఎం సంస్థ షేర్లు దారుణంగా పడిపోయాయి. మంగళవారం ఒక్క రోజే సుమారు 25 శాతం షేర్లు ఢమాల్ అయ్యాయి. రెండో క్వార్టర్‌కు చెందిన ఫలితాలను అమెరికా కంపెనీ రిలీజ్ చేసింది. ఆ ఫలితాల ఆధారంగా స్టాక్స్ ఒక్కసారిగా కుప్పకూలాయి. గడిచిన 58 ఏళ్లలో ఆ కంపెనీ షేర్లు ఇంత దారుణంగా పడిపోవడం ఇదే మొదటిసారి. షేర్లు పడిపోవడం వల్ల ఐబీఎం కంపెనీ సుమారు 70 బిలియన్ల డాలర్లు నష్టపోయినట్లు తెలుస్తోంది. 1911లో ఐబీఎం కంపెనీ స్థానపించారు. అయితే జూన్‌లో ఆ కంపెనీ రెవన్యూ కేవలం ఒక్క శాతం 17.2 బిలియన్ల డాలర్లు మాత్రమే పెరిగింది. తమ కంపెనీ విఫలమైందని, పరిస్థితులకు తగినట్లు ముందుకు వెళ్లలేకపోయిందని ఐబీఎం సీఈవో అరవింద్ కృష్ణ ఆ కంపెనీ ఇన్వెస్టర్లకు లేఖలో పేర్కొన్నారు. ఐబీఎం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ బిజినెస్‌లో ఏడు శాతం రెవన్యూ పతనమైంది, సాఫ్ట్‌వేర్ రెవన్యూ అయిదు శాతం పెరిగినా.. అంచనాలకు తగినట్లుగా లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బూమ్‌ను తమ కంపెనీ అందుకోలేకపోయినట్లు అరవింద్ కృష్ణ వెల్లడించారు. చాలా వరకు పెద్ద కంపెనీలతో తమ డీల్స్ జరగలేదని ఆయన తెలిపారు. ఏఐ ఆధారిత ప్రాముఖ్యత పెరిగిపోవడంతో తమ కంపెనీ కొత్త డీల్స్ చేసుకోలేకపోయినట్లు ఆయన చెప్పారు. 1987లో వచ్చిన బ్లాక్ మండే క్రాష్ కన్నా దారుణంగా ఈసారి షేర్లు పడిపోయినట్లు తెలిపారు. ఐబీఎం మార్కెట్ విలువ సుమారు 272 బిలియన్ల డాలర్లు. దాంట్లో సుమారు 70 బిలియన్ల డాలర్లు ఆ కంపెనీ నష్టపోయినట్లు అంచనా వేస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu