కేరళలో జరిగిన ఒక ఘటనలో వినియోగదారుడికి జరిగిన అన్యాయాన్ని గుర్తించిన వినియోగదారుల కోర్టు, ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారీ జరిమానా విధించింది. కన్నూరు జిల్లాకు చెందిన అనీమ అనే ఇంజనీర్, 2025 సెప్టెంబర్‌లో అమేజాన్ ద్వారా రూ. 1,945 విలువైన ఒక 'బ్లాక్ కలర్' బ్రాండెడ్ షూను ఆర్డర్ చేశారు. అయితే, డెలివరీ అయిన ప్యాకెట్‌ను ఓపెన్ చేసి చూడగా, అందులో అడ్వర్టైజ్మెంట్‌లో చూపిన దానికి భిన్నంగా 'వైట్ కలర్' సోల్ కలిగిన వేరే షూ వచ్చింది. తప్పు వస్తువు వచ్చిన వెంటనే అనీమ ఆ షూను తిరిగి పంపించారు. అయితే, ఆ వస్తువు తమకు అందలేదని చెబుతూ అమెజాన్ రీఫండ్ ఇచ్చేందుకు నిరాకరించింది. రీఫండ్ రాక, సంస్థ నుంచి సరైన స్పందన లేక విసిగిపోయిన అనీమ, కన్నూరు జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు. న్యాయం గెలిచింది ఈ కేసును విచారించిన కోర్టు, అమెజాన్‌కు నోటీసులు పంపినప్పటికీ ఆ సంస్థ తరపున ఎవరూ హాజరుకాకపోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. వినియోగదారుడి ఫిర్యాదులో నిజాయితీ ఉందని నిర్ధారించుకున్న కోర్టుషూ ధర రూ. 1,945ను అనీమకు తిరిగి చెల్లించాలని, సేవా లోపం వల్ల వినియోగదారుడు పడ్డ మానసిక వేదనకు రూ. 8,000 పరిహారంగా ఇవ్వాలని, ఈ కింది విధంగా ఆదేశించింది. కేసు కోసం అయిన ఖర్చుల కింద మరో రూ. 4,000 చెల్లించాలని, మొత్తంగా రూ. 12,000ను 30 రోజుల్లోపు చెల్లించాలని కోర్టు అమెజాన్‌ను ఆదేశించింది.
0 Comments