Ad Code

సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ కలకత్తా హైకోర్టుకు మమతా బెనర్జీ : విచారణకు స్వయంగా హాజరు

శ్చిమ బెంగాల్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో భవానీపూర్ సీటు నుంచి పోటీ చేసి సువేందు అధికారి చేతిలో ఓటమిపాలైన మమతా బెనర్జీ ఈ ఫలితాన్ని సవాల్ చేస్తూ కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే ఆమె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇవాళ ఈ కేసు విచారణకు మమత స్వయంగా హాజరయ్యారు. ఈ కేసును మమతకు విధేయుడైన తృణమూల్ ఎంపీ, లాయర్ కళ్యాణ్ బెనర్జీ వాదిస్తున్నారు. ఇవాళ విచారణపై కళ్యాణ్ బెనర్జీ స్పందించారు. సువేందు అధికారి ఎన్నికను సవాలు చేస్తూ మమతా బెనర్జీ దాఖలు చేసిన ఎన్నికల పిటిషన్‌ను ధృవీకరించడానికి ఆమె ఈ రోజు కలకత్తా హైకోర్టుకు వచ్చారని కళ్యాణ్ బెనర్జీ తెలిపారు. ఆ ఎన్నిక సక్రమంగా జరగలేదని, 12 రౌండ్ల తర్వాత, మమతను , ఆమె ఎన్నికల ఏజెంట్‌ను కొట్టి బయటకు పంపేశారని తెలిపారు. అసలు ఆ రిటర్నింగ్ ఆఫీసర్ ఎవరు? 2021 నందిగ్రామ్ ఎన్నికల్లో ఆయనే ఆర్వోగావ్యవహరించారు. మళ్లీ ఇప్పుడు ఆయనే ఆర్వోగా వచ్చారు. ఆ తర్వాత, ఆయనను ముఖ్యమంత్రికి డిప్యూటీ సెక్రటరీగా నియమించారు, ఎన్నికలైన వెంటనే రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని చీఫ్ సెక్రటరీగా నియమించారని కళ్యాణ్ బెనర్జీ ఆరోపించారు. వారిపై అనేక ఆరోపణలు ఉన్నాయని, అలాగే వారు పక్షపాతం చూపించే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోందని తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu