Ad Code

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని సత్కరించిన ఎన్డీఏ నేతలు

భారత మండపంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన ఎన్డీఏ నేతలు సమావేశమయ్యారు. ఎన్డీఏ ప్రభుత్వానికి 12 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఈ సమావేశం జరుపుతున్నారు. అత్యధిక కాలం ప్రధానిగా పనిచేసిన రికార్డును సొంతం చేసుకున్న మోడీని ఎన్డీఏ నేతలు సత్కరించారు. మోడీని అభినందిస్తూ ఎన్డీఏ తీర్మానం చేసింది. ఈ సమావేశంలో పలువురు కేంద్ర మంత్రులు పాల్గొన్నారు. ఎన్‌డీఏలోని కీలక నేతలు భారత్ మండపానికి చేరుకుని సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ, త్రిపుర ముఖ్యమంత్రి మాణిక్ సాహా, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ హాజరయ్యారు. అలాగే, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి, బిహార్ ముఖ్యమంత్రి సమ్రాట్ చౌధరి కూడా సమావేశంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కూటమి భవిష్యత్ వ్యూహం, రాజకీయ అజెండాపై ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. కాగా, 2014 మే 26న తొలిసారి పదవీ బాధ్యతలు చేపట్టిన ప్రధాని మోడీ, ఇప్పుడు ప్రభుత్వ అధినేతగా వరుసగా 4,399 రోజులు పూర్తి చేశారు. ఎన్నికైన ప్రభుత్వ అధినేతగా జవహర్‌లాల్ నెహ్రూ పదవీకాలాన్ని అధిగమించారు. అయితే నెహ్రూ 1947 నుంచి 1964లో మరణించే వరకు ప్రధానిగా కొనసాగారు. 

Post a Comment

0 Comments

Close Menu