Ad Code

కర్ణాటక ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం : ఉప ముఖ్యమంత్రిగా డాక్టర్ పరమేశ్వర


ర్ణాటకలో ముఖ్యమంత్రిగా డీకే.శివకుమార్ ప్రమాణస్వీకారం చేశారు. రాజధాని బెంగళూరులోని లోక్‌భవన్‌లో సాయంత్రం 4:05 గంటలకు గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్ శివకుమార్‌తో ప్రమాణస్వీకారం చేయించారు. శివకుమార్‌తో పాటు దాదాపు 13 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కొత్త కేబినెట్‌లో ప్రాంతీయ, సామాజిక సమీకరణాలకు పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అలాగే సీనియర్ నాయకుడు డాక్టర్ పరమేశ్వర కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ చారిత్రాత్మక ఘట్టానికి కాంగ్రెస్ అధిష్టానం, ప్రముఖ నేతలు హాజరయ్యారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యలతో పాటు పలువురు సీనియర్ నాయకులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. డిప్యూటీ సీఎంగా జి.పరమేశ్వర ప్రమాణస్వీకారం చేయగా, ప్రియాంక్ ఖర్గే, యతీంద్ర సిద్ధరామయ్య, కె.జె.జార్జ్‌, కేహెచ్‌ మునియప్ప, ఎంబీ పాటిల్‌, రామలింగారెడ్డి, సతీశ్‌ జర్కిహోళి, కృష్ణబైరి గౌడ, యూటీ.ఖాదిర్‌, ఈశ్వర్‌ ఖండ్రే, బైరతి సురేశ్‌, శరణ్‌ ప్రకాశ్‌ పాటిల్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu