పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం క్రికెటర్ సౌరవ్ గంగూలీకి ఉన్న జెడ్ కేటగిరీ భద్రతను వై కేటగిరీకి తగ్గించింది. రాష్ట్రంలో ప్రముఖ వ్యక్తులకు కల్పిస్తున్న భద్రతపై జరుగుతున్న సమీక్షలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇప్పటి వరకు గంగూలీకి జెడ్ కేటగిరీ భద్రత ఉండేది. ఈ కేటగిరీలో సుమారు 35 మంది భద్రతా సిబ్బంది, పైలట్ వాహనం వంటి ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. తాజాగా ఆయన భద్రతను వై కేటగిరీకి మార్చడంతో ముగ్గురు నుంచి నలుగురు సిబ్బంది మాత్రమే భద్రతా బాధ్యతలు నిర్వహించనున్నారు. అందులో ఇద్దరు సాయుధ భద్రతా సిబ్బంది కూడా ఉంటారు.
0 Comments