కేతన్‌ హత్య కేసు : 'బ్లేమ్ గేమ్' ఆడుతున్న సియా గోయల్, చేతన్ చౌదరి

హారాష్ట్రలోని పుణే వ్యాపారవేత్త కేతన్ అగర్వాల్ హత్య కేసు విచారణలో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది. జూన్ 18న లోహగఢ్ కోట వద్ద కేతన్ మృతి చెందిన ఘటనలో అరెస్ట్ అయిన కేతన్‌ కాబోయే భార్య సియా గోయల్, ఆమె ప్రియుడు చేతన్ చౌదరి ఇప్పుడు ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటున్నారు. ఈ హత్యకు ప్రధాన సూత్రధారి ఎవరో తెలియకుండా, ఇద్దరూ తమను తాము రక్షించుకునే ప్రయత్నంలో ఉన్నారు. పోలీసుల సమాచారం ప్రకారం నిందితులిద్దరూ 'బ్లేమ్ గేమ్' ఆడుతున్నారు. సియా, చేతన్ ఇద్దరూ పక్కా ప్లాన్ ప్రకారం కేతన్‌ను నిర్దాక్షిణ్యంగా హత్య చేసి, ఇపుడు నేరాన్ని ఒకరిపై ఒకరు నెట్టేసుకుంటున్నారు. తాను సియాతో కలిసి పారిపోవాలనుకున్నాను. కానీ కేతన్‌ను చంపమని సియానే ఒత్తిడి తెచ్చిందని చేతన్ మాట మారుస్తు న్నాడు. అటు సియా కూడా అసలు ఈ హత్య ప్లాన్ అంతా చేతన్‌దే. జూన్ 14న జరిగిన మొదటి ప్రయత్నం విఫలమైనప్పుడు చేతన్ బోరున ఏడ్చాడు అంటూ సియా కొత్త నాటకానికి తీరతీసినట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం వారి ఎత్తులను సరిగ్గానే అర్థం చేసుకుంటున్నారు. ఇదంతా బ్లేమ్‌ గేమ్‌ అనీ, వారి డిఫెన్స్ స్ట్రాటజీ అని, కేతన్‌ను అంతం చేయాలనే కుట్రలో ఇద్దరూ సమానంగా భాగస్వాములని భావిస్తున్నారు.

Next Post Previous Post
No Comment
Add Comment
comment url




sr7themes.eu.org