Ad Code

రాజోలులో భారీగా రేషన్ బియ్యం పట్టుకున్న విజిలెన్స్ అధికారులు

ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్.బిఆర్.అంబేడ్కర్ కోనసీమ జిల్లా, రాజోలు మండలం,ములికిపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ ఉంచిన పీడీఎస్ బియ్యాన్ని సోమవారం విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ములికిపల్లి గ్రామానికి చెందిన అడబాల సూర్యనారాయణ (అబ్బ) అనే వ్యక్తి కొంతకాలంగా లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి, అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు సమాచారం అందడంతో అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల్లో మొత్తం సుమారు 4 క్వింటాళ్ల 25 కిలోల పీడీఎస్ బియ్యాన్ని స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. పేదలకు పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమంగా కొనుగోలు చేసి నిల్వ ఉంచడంపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పీడీఎస్ బియ్యాన్ని విక్రయించడం, నిల్వ ఉంచడం లేదా అక్రమంగా రవాణా చేయడం చట్టవిరుద్ధమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.

Post a Comment

0 Comments

Close Menu