తెలంగాణలోని భూపాలపల్లి జిల్లాలో పరకాల-భూపాలపల్లి హైవేపై వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అటువైపుగా వచ్చిన ఓ బొగ్గు టిప్పర్ ఒక్కసారిగా అదుపు తప్పి అధికారుల పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో జిల్లా రవాణా అధికారి వెంకన్నకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మరణించారు. వెంకన్న మృతదేహం టిప్పర్ లారీ కింద పడి మొత్తం నుజ్జు నుజ్జు అయింది.. అది చూసిన స్థానికులు, పోలీసులు భయభ్రాంతులకు గురయ్యారు. వెంకన్నను వెంటనే హాస్పిటల్ కి తరలించారు. కానీ అప్పటికే వెంకన్న వైద్యులు వెల్లడించారు. మృతుడు వెంకన్న కేవలం 15 రోజుల క్రితమే భూపాలపల్లి జిల్లాకు బదిలీపై వచ్చారు. విధుల్లో చేరి రెండు వారాలు కూడా గడవకముందే, అదీ విధి నిర్వహణలో ఉండగానే ఇలా రోడ్డు ప్రమాదంలో మరణించడంతో రవాణా శాఖ అధికారులు, తోటి ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. విషయం తెలుసుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లారీ బ్రేకులు ఫెయిల్ కావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదా డ్రైవర్ నిర్లక్ష్యం వల్ల జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. అధికారిక దర్యాప్తు పూర్తయ్యాక ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు వెల్లడి కానున్నాయి.
0 Comments