ఆంధ్రప్రదేశ్ లోని కర్నూలు లో నేడు కామినేని జెమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించారు. ఈ అత్యాధునిక క్యాన్సర్ వైద్య సంస్థ కర్నూలు మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు సమగ్ర, ఆధునిక క్యాన్సర్ చికిత్స సేవలను అందించేందుకు అంకితభావంతో పనిచేయనుందని సంస్థ డైరెక్టర్ డాక్టర్ రావిపాటి శ్రీనివాస కుమార్ తెలిపారు. అధునాతన క్యాన్సర్ చికిత్సలు కేవలం మహానగరాలకే పరిమితం కాకూడదు అనే ముఖ్య ఉద్దేశంతో అత్యాధునిక నిర్ధారణ సదుపాయాలు, చికిత్సా విధానాలతో కూడిన కామినేని జెమ్ కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ను కర్నూలులో అందుబాటులోకి తీసుకు వచ్చాము అని ఆయన పేర్కొన్నారు. అత్యున్నత సాంకేతికతతో కూడిన 4D ట్రూబీమ్ రేడియేషన్ థెరపీని సైతం అందుబాటులోకి తెచ్చాము అని, దీని ద్వారా క్యాన్సర్ కణాలపై అత్యంత కచ్చితత్వంతో రేడియేషన్ చికిత్స అందిస్తూ, ఆరోగ్యకరమైన కణజాలంపై ప్రభావాన్ని తగ్గించి మెరుగైన చికిత్సా ఫలితాలను పొందవచ్చు అన్నారు. జెమ్ కేర్ కామినేని హాస్పిటల్ సీనియర్ జనరల్ ఫిజీషియన్ & సీఈఓ డాక్టర్ ఎస్.వి.చంద్రశేఖర్ మాట్లాడుతూ, క్యాన్సర్ చికిత్స అనేది కేవలం సాంకేతిక పరిజ్ఞానంతో మాత్రమే సాధ్యమయ్యేది కాదని, మెడికల్ ఆంకాలజిస్టులు, రేడియేషన్ నిపుణులు, శస్త్రచికిత్స నిపుణులు మరియు సహాయక వైద్య బృందాల సమిష్టి కృషి ఎంతో కీలకం అన్నారు.కాన్సర్ కు చికిత్స కంటే అవగాహనే ముఖ్యం అని అయన గుర్తుచేశారు. ప్రస్తుత యాంత్రిక జీవనం లో ప్రతి వ్యక్తి తమ ఆరోగ్యం కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే భవిశ్యత్తులో వచ్చే ఆరోగ్య సమస్యలను నివారించవచ్చు అన్నారు. ఈ కార్యక్రమంలో జెమ్కర్ గ్రూప్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శ్రీకాంత్ నంబూరి, జెమ్కర్ గ్రూప్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ డి. దినేష్, తదితరులు పాల్గొన్నారు.
0 Comments