తెలంగాణలోని ఆసిఫాబాద్ మండలం, కోసరా గ్రామ పంచాయితీలో గల భవాని నగర్ తాండలో భార్యభర్తల హత్య జరిగినట్లు కుమారుడు ఫిర్యాదు చేశాడు. బంధువులు తెలిపిన వివరాల ప్రకారం బానోత్ రాజునాయక్ (50), సుశీల (45) బుధవారం రాత్రి ఇంటి ముందు పడుకున్న చోట హత్యకు గురయ్యారు. వివరాల్లోకి వెళితే గతంలో కోసరాలో పీరిల ప్రతిమలు దొంగలించ బడ్డాయి. ఇదే సంఘటన పోలీస్ స్టేషన్ లో సైతం కేసు నమోదు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే గ్రామస్తులు రాజునాయక్ చందాలతో ఈసారి పీరిల ప్రతిమలు చేయించి బుధవారం రోజున కోసరాలోని పీరిల బంగ్లాలో ప్రతిష్టించడం జరిగింది. గతంలో పీరిల ప్రతిమలు దొంగిలించిన ఆగంతకులు ఈసారి రాజునాయక్ కు పీరిల దేవుడు రానుండడంతో ఆగంతకుల వివరాలు వెల్లడిస్తే ఇబ్బంది అవుతుందని భావించి ఈ అఘాత్యానికి పాల్పడినట్లు మృతుల బంధువులు తెలిపారు. పథకం ప్రకారమే భార్య భర్తలను హత్య చేసినట్లరని అన్నారు. బుధవారం రాత్రి పీరిల బంగ్లా పూజ అనంతరం రాజునాయక్ ఇంటి వద్ద హాలులో భార్యభర్తలు నిద్రలో ఉపక్రమించడంతో అర్థరాత్రి విద్యుత్ సరఫరా నిలిపివేసి ఈ ఆగంతకానికి పాల్పడినట్లు కుమారులు ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం కొరకు మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. కేసును ఆసిఫాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
0 Comments