ఫిపా ప్రపంచకప్‌లో కొలంబియా నాకౌట్‌లో అడుగుపెట్టింది. గ్రూప్-కెలో భాగంగా బుధవారం కాంగోతో జరిగిన మ్యాచ్‌లో కొలంబియా 1-0తో విజయాన్ని సాధించింది. కొలంబియా తరఫున 74వ నిమిషంలో డానియెల్ మునోజ్ గోల్ చేశాడు. దీంతో గ్రూప్‌లో రెండు విజయాలు అందుకున్న కొలంబియా రౌండ్ ఆఫ్-32కు అర్హత సాధించింది. అయితే మ్యాచ్‌లో కొలంబియా పదే పదే కాంగో గోల్ పోస్టులపై దాడి చేసినప్పటికీ, ఆ జట్టు గోల్ కీపర్ లియోనల్ పాసి అద్భుత ప్రదర్శన కనబరిచి చాలా సేవ్స్ చేశాడు. ఇక మ్యాచ్ డ్రా అనుకున్న తరుణంలో మునోజ్ గోల్‌కీపర్‌ను తెలివిగా బోల్తా కొట్టించి బంతిని గోల్ పోస్టులోకి తరలించాడు. దీంతో కొలంబియా 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది. అయితే తర్వాత కూడా గోల్ చేసే అవకాశాలు వచ్చినప్పటికీ కాంగో గోల్ కీపర్ సమర్థంగా అడ్డుకోవడం జరిగింది. మ్యాచ్ జరిగిన స్టేడియంలో 90 శాతానికి పైగా అభిమానులు కొలంబియాకు చెందినవారే ఉన్నారు. అయితే వీరిలో అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం కాంగోకు చెందిన మిచెల్ కుకా మ్బోలాడింగా. తమ జాతీయ జెండా రంగులను సూట్ రూపంలో ధరించిన మిచెల్, మ్యాచ్ జరిగినంత సేపు స్టాండ్‌లో ఒక కుర్చీపై ఇంచు కూడా కదలకుండా కుడి చేతిచేతిని పైకెత్తి 90 నిమిషాల పాటు శిలా విగ్రహంలా నిలబడ్డాడు. ఇదంతా ఎందుకా అని ఆరా తీస్తే.. వీసా సమస్య కారణంగా కాంగో ఆడిన మొదటి మ్యాచ్ చూసే అవకాశం మిచెల్ కుకాకు లభించలేదు. వీసా క్లియరెన్స్ రావడంతో అమెరికాలో అడుగుపెట్టిన అతడి విచిత్ర వేషదారణ చూసి కొలంబియన్ అభిమానులు భారీ కేరింతలతో స్టేడియంలోకి స్వాగతించడం విశేషం. ఇదే గ్రూప్‌లో ఉన్న పోర్చుగల్ అంతకముందు ఉజ్బెకిస్తాన్‌పై 5-0తో విజయం సాధించిన సంగతి తెలిసిందే. పోర్చుగల్‌తో జరిగే చివరి గేమ్‌ను డ్రా చేసుకుంటే టాపర్‌గా నాకౌట్‌కు చేరుకుంటుంది. ఒకవేళ ఓడిపోతే మాత్రం నాకౌట్‌లో ఇంగ్లండ్ ఉన్న గ్రూప్‌లో రన్నరప్‌తో కొలంబియా తలపడనుంది.
0 Comments