Ad Code

ఐపీఓకు సిద్ధమవుతున్న ఐదు కంపెనీలు

దేశీయ ప్రాథమిక మార్కెట్‌ రానున్న రోజుల్లో ఐపీఓలతో మరింత సందడి చేయనుంది. గ్లోబల్‌ ట్రావెల్‌-టెక్‌ యూనికార్న్‌ ఓయో మాతృసంస్థ 'ప్రిజమ్‌', వార్‌బర్గ్‌ పింకస్‌ పెట్టుబడులున్న 'ట్రూహోమ్‌ ఫైనాన్స్‌', 'వీగాలాండ్‌ డెవలపర్స్‌', 'అద్వాంతా ఎంటర్‌ప్రైజెస్‌', 'మెహతా హైటెక్‌ ఇండస్ట్రీస్‌'ల పబ్లిక్‌ ఇష్యూలకు సెబీ అనుమతి ఇచ్చింది. ఈ ఐదు కంపెనీలు కలిపి సుమారు రూ.10,000 కోట్లు సమీకరించే అవకాశం ఉందని మర్చంట్‌ బ్యాంకర్లు అంచనా వేస్తున్నారు. కంపెనీలు దాఖలు చేసిన ముసాయిదా పత్రాలపై సెబీ జూన్‌ 1-5 మధ్య తన పరిశీలన పూర్తిచేసి అనుమతులు జారీ చేసింది. గ్లోబల్‌ ట్రావెల్‌-టెక్‌ దిగ్గజం ఓయోను నిర్వహిస్తున్న 'ప్రిజమ్‌' సంస్థ ఐపీఓ ద్వారా రూ.6,650 కోట్లు సమీకరించాలని యోచిస్తోంది. ఈ ఇష్యూతో సంస్థ విలువ 7-8 బిలియన్‌ డాలర్ల మధ్య ఉండొచ్చని మార్కెట్‌ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సంస్థ 2025 డిసెంబరులో కాని్ఫడెన్షియల్‌ ప్రి-ఫైలింగ్‌ మార్గం ద్వారా సెబీకి ముసాయిదా పత్రాలను సమరి్పంచింది. ఓయో ఆపరేటర్‌ 'ఒరవెల్‌ స్టేస్‌' 2025 సెప్టెంబరులో 'ప్రిజమ్‌'గా పేరు మార్చుకుంది.

Post a Comment

0 Comments

Close Menu