Ad Code

దీదీ మారిపోయారు, ఎంతలా అంటే మేమెవరం ఆమె తీరును జీర్ణించుకోలేనంతలా : ఎంపీ శతాబ్ది రాయ్


శ్చిమ బెంగాల్‌ రాజకీయాల్లో షాకింగ్‌ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. దారుణ ఓటమి తర్వాత, మమతా బెనర్జీ పార్టీ చీలిక సంకేతాలతో తీవ్ర గందరగోళం నెలకొంది. తృణమూల్ కాంగ్రెస్‌లో అంతర్గత అసంతృప్తి తీవ్ర స్థాయికి చేరిందని, పార్టీ నుంచి వేరుపడిన ఎంపీలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. టీఎంసీ రెబల్ ఎంపీ శతాబ్ది రాయ్ ఓ జాతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాలుగుసార్లు ఎంపీగా గెలిచిన శతాబ్ది రాయ్‌ 2009 నుంచి మమతా బెనర్జీతో అనుబంధం ఉంది. అయితే టీఎంసీలో మునుపటి పరిస్థితులు లేవని అంటున్నారామె. "దీదీ మారిపోయారు. ఎంతలా అంటే.. మేమెవరం ఆమె తీరును జీర్ణించుకోలేనంతలా. గత కొన్నేళ్లలో పార్టీ నిర్ణయాల తీరు పూర్తిగా మారిపోయింది. ఎంపీలైనప్పటికీ మా పరిస్థితి దారుణంగా ఉండేది. పార్టీ లోపల మా గొంతుక వినిపించే పరిస్థితి లేదు. ఎప్పటికప్పుడు సమస్యలను చెప్పినా, నాయకత్వం స్పందించేది కాదు. క్షేత్రస్థాయి పరిస్థితులను వివరించాలని ప్రస్తావించిన వినిపించుకోలేదు. పైగా నిర్ణయాల్లోనూ కొందరికే ప్రాధాన్యం ఉండేది. ఆ విషయంలో మమ్మల్ని పూర్తిగా పక్కన పెట్టేవారు. దీదీతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. కానీ, ఆమె ఇప్పుడు పాత దీదీ కాదు. కానీ ప్రజల కోసం పని చేయాలనే లక్ష్యంతోనే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని శతాబ్ధిరాయ్‌ తెలిపారు. అలాగే పార్టీలో కింది స్థాయి నుంచి పై స్థాయి దాకా అవినీతి పేరుకుపోయింది. అది చూసి నేనెంతో నిరాశకు లోనయ్యా. వ్యక్తిగతంగా నాకు స్వచ్ఛమైన ఇమేజ్‌ ఉంది. అందుకే బయటకు వచ్చేశానని అన్నారామె. శతాబ్ది రాయ్‌ (56) ప్రముఖ బెంగాలీ సినీ నటి. నటనతో పాటు దర్శక నిర్మాతగానూ ఆమె గుర్తింపు పొందారు. 2009లొ టీఎంసీ తరఫున లోక్‌సభ ఎన్నికల్లో బీర్బూమ్‌ నుంచి పోటీ చేసిన నెగ్గారు. అప్పటి నుంచి వరుసగా ఆమెనే ఎన్నికవుతూ వస్తున్నారు. తృణమూల్ కాంగ్రెస్‌ (టీఎంసీ)కు లోక్‌సభలో డిప్యూటీ నేతగా ఆమె ఉన్నారు. మమతా బెనర్జీతో దాదాపు రెండు దశాబ్దాల అనుబంధం ఉన్న నేతగా ఆమెను పరిగణిస్తారు. అందుకే ఆమె చేసిన వ్యాఖ్యలు బెంగాల్‌ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.

Post a Comment

0 Comments

Close Menu