Ad Code

ట్రెండింగ్‌లో మోడీ వాచ్ : జైపూర్ వాచ్ కంపెనీ కి చెందిన బాఘ్ టైమ్‌పీస్

ఫ్రాన్స్‌లోని ఎవియాన్‌లో జరిగిన ఈ అంతర్జాతీయ సదస్సులో ప్రధాని మోడీ ధరించిన జైపూర్ వాచ్ కంపెనీ కి చెందిన బాఘ్ టైమ్‌పీస్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో ట్రెండ్ అవుతోంది. మేక్ ఇన్ ఇండియా కు, భారతీయ వారసత్వానికి ప్రతీకగా నిలిచిన ఈ లగ్జరీ వాచ్ కథనం అంతర్జాతీయ స్థాయిలో మన దేశీ బ్రాండ్ ఖ్యాతిని చాటిచెబుతోంది.ప్రధాని నరేంద్ర మోడీ ధరించిన ఈ వాచ్ సాధారణమైనది కాదు, దీని వెనుక భారతదేశ స్వాతంత్ర్య చరిత్ర దాగి ఉంది. జైపూర్ వాచ్ కంపెనీకి చెందిన సిగ్నేచర్ బాఘ్ కలెక్షన్‌లో భాగంగా రూపొందించిన ఈ వాచ్ డయల్‌లో బ్రిటిష్ ఇండియా చివరి సంవత్సరమైన 1947 నాటి అసలైన ఒక రూపాయి నాణేన్ని ఉపయోగించారు. ఈ నాణెంపై గంభీరంగా నడుస్తున్న పులి బొమ్మతో పాటు ONE RUPEE INDIA 1947 అనే అక్షరాలు ఉంటాయి. భారతదేశ చరిత్రను, ఆధునిక మెకానికల్ వాచ్ మేకింగ్ టెక్నాలజీతో జపనీస్ మియోటా ఆటోమేటిక్ మూవ్‌మెంట్‌ మిళితం చేసి సుమారు రూ. 60,000 ధర పరిధిలో అందించే ఈ యాక్సెస్బుల్ లగ్జరీ టైమ్‌పీస్ ఇప్పుడు గ్లోబల్ స్టేజ్‌పై భారతీయ గర్వానికి చిహ్నంగా నిలిచింది.

Post a Comment

0 Comments

Close Menu