Ad Code

డ్రైవర్ ని వరించిన పంజాబ్ రాష్ట్ర సూపర్ లాటరీ

సామాన్య ట్యాక్సీ డ్రైవర్ ని  పంజాబ్ రాష్ట్ర సూపర్ లాటరీ అదృష్టం రూపంలో వరించింది. కేవలం రూ.500 పెట్టుబడితో రూ.3 కోట్ల భారీ జాక్‌పాట్ గెలుచుకున్నాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని కాంగ్రా జిల్లా, ఫతేపూర్ ప్రాంతానికి చెందిన కల్యాణ్‌చంద్ వృత్తిరీత్యా ట్యాక్సీ డ్రైవర్‌. ప్రతిరోజూ లాగే ఆయన సాధారణంగానే తన విధులను నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఒక ప్రయాణికుడిని లాంగ్ రూట్‌లో దింపేందుకు ఆయన పంజాబ్‌లోని బటిండానగరానికి వెళ్లాల్సి వచ్చింది. బటిండాలో ప్రయాణికుడిని దించిన తర్వాత, కల్యాణ్‌చంద్ అక్కడ స్థానికంగా ఉన్న 'రతన్ లాటరీ స్టాల్' లో  రూ.500 విలువైన రెండు లాటరీ టికెట్లను కొనుగోలు చేశారు. ఆ తర్వాత ఎప్పటిలాగే తన ట్యాక్సీని తీసుకుని తిరిగి సొంత ఊరికి చేరుకున్నారు. లాటరీ ఫలితాలు వెల్లడైన రోజు కల్యాణ్‌చంద్‌కు నమ్మలేని నిజం తెలిసింది. ఆయన కొనుగోలు చేసిన టికెట్లలో ఒకదానికి పంజాబ్ సూపర్ లాటరీలో మొదటి బహుమతి లభించింది. ఆ మొదటి బహుమతి నగదు విలువ అక్షరాలా రూ.3 కోట్లు. కేవలం రూ.500 రూపాయలతో కొన్న చిన్న కాగితం ముక్క, ఆయన కుటుంబ రాతను మార్చేసింది. రూ.3 కోట్ల భారీ నగదు బహుమతి గెలుచుకున్నారనే వార్త వినగానే కల్యాణ్‌చంద్ కుటుంబ సభ్యులు ఆనంద డోలికల్లో మునిగిపోయారు.


Post a Comment

0 Comments

Close Menu