అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దక్షిణమధ్య రైల్వే హైదరాబాద్‌లో 14 స్టేషన్ల ఆధునికీకరణకు శ్రీకారం చుట్టింది. బేగంపేట్ స్టేషన్ పూర్తిస్థాయి సదుపాయాలతో గతేడాది అందుబాటులోకి వచి్చంది. హైటెక్‌సిటీ, హఫీజ్‌పేట్ స్టేషన్ల పునరాభివృద్ధి పనులు తుదిదశకు చేరుకున్నాయి. త్వరలో ఈ స్టేషన్లను ప్రారంభించనున్నట్లు అధికారులు తెలిపారు. మొత్తం 14 స్టేషన్‌లకు రూ.2076.42 కోట్లతో పునరాభివృద్ధి పనులను ప్రారంభించారు. సికింద్రాబాద్, కాచిగూడ, నాంపల్లి ప్రధాన స్టేషన్లు మినహాయిస్తే మిగతావన్నీ ఎంఎంటీఎస్ స్టేషన్లు. సుమారు రూ.714.73 కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్‌స్టేషన్ రీడెవలప్‌మెంట్ పనులు ఊపందుకున్నాయి.రూ.29.21 కోట్లతో చేపట్టిన హఫీజ్‌పేట్, రూ.35.61 కోట్లతో చేపట్టిన హైటెక్‌సిటీ స్టేషన్లలో పనులు తుదిదశకు చేరుకొన్నాయి. వీటిని అద్భుతమైన ఆర్కిటెక్చర్‌తో కళాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. అత్యాధునిక టాయిలెట్లు, తాగునీటి సదుపాయాలు, సీట్లు, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లను ప్రయాణికులు మెచ్చేలా అద్భుతంగా ఏర్పాటు చేస్తున్నారు.
0 Comments