అమెరికా, ఇరాన్ యుద్ధానికి ఎట్టకేలకు తెర పడింది. ఇరు దేశాల మధ్య ప్రాథమిక శాంతి ఒప్పందం కుదిరినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధికారికంగా ధృవీకరించారు. ఇరు దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించడానికి, యుద్ధాన్ని శాశ్వతంగా ముగించడానికి ఈ డీల్ ఎంతో సహాయపడుతుందని ట్రంప్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. జూన్ 19న స్విట్జర్లాండ్ వేదికగా ఈ చారిత్రాత్మక ఒప్పందంపై అధికారికంగా సంతకాలు జరగనున్నాయి. ఈ సుదీర్ఘ యుద్ధాన్ని ఆపడానికి పొరుగు దేశాలైన పాకిస్తాన్, ఖతార్‌లు కీలక మధ్యవర్తులుగా వ్యవహరించాయి. రెండు దేశాల ప్రతినిధులతో మాట్లాడి యుద్ధ విరమణకు ఒప్పించాయి. ఈ డీల్ ప్రకారం లెబనాన్ ఫ్రంట్‌తో సహా అన్ని వైపులా జరుగుతున్న సైనిక చర్యలను తక్షణమే, శాశ్వతంగా నిలిపివేయడానికి ఇరు దేశాలు అంగీకరించాయి. అలాగే ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని అన్ని రకాల అంతర్జాతీయ ఓడల రాకపోకల కోసం 30 రోజుల్లోగా పూర్తిగా తెరిచేందుకు ఇరాన్ ఒప్పుకుంది. దీనికి బదులుగా ఇరాన్ ఓడరేవులపై విధించిన నౌకాదళ దిగ్బంధనాన్ని అమెరికా వెంటనే తొలగించనుంది.
0 Comments