రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నుంచి ఢిల్లీకి వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌పై గురువారం రాత్రి కొందరు గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు రువ్వారు. రైలు కదులుతుండగా జరిగిన ఈ దాడిలో ఎసీ ఫస్ట్ క్లాస్ కోచ్‌లోని ఒక కిటికీ అద్దం దెబ్బతింది. ఇదే కోచ్‌లో మోహన్ భగవత్ ప్రయాణిస్తున్నారని, అయితే కిటికీకి వేరేవైపు ఆయన కూర్చోవడంతో ఎలాంటి గాయాలు కాలేదని అధికారులు తెలిపారు. కాగా, ఈ ఘటనపై రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్, స్థానిక పోలీసులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ముగ్గురు వ్యక్తులు రాళ్లు రువ్వినట్టు గుర్తించారు. వీరిలో ఇద్దరిని అరెస్టు చేశారు. రైలుపై దాడి ఉద్దేశపూర్వకంగా జరిగిందా, రైల్వే ట్రాక్ సమీపంలో దుండగులు చేసిన పనా అనే దానిపై భద్రతా సంస్థలు ఆరా తీస్తున్నాయి.
0 Comments