Ad Code

ప్రపంచ చమురు డిమాండ్ పెరుగుదలలో దాదాపు 50 శాతం వాటా భారత్‌దే : రోస్‌నెఫ్ట్ సీఈఓ ఇగోర్ సెచిన్

ష్యాలోని సెయింట్ పీటర్స్‌బర్గ్ అంతర్జాతీయ ఆర్థిక వేదికలో రోస్‌నెఫ్ట్ సీఈఓ ఇగోర్ సెచిన్ మాట్లాడుతూ రాబోయే దశాబ్ధంలో ప్రపంచ చమురు డిమాండ్ పెరుగుదలలో దాదాపు 50 శాతం వాటా భారత్‌దే అని అంచనా వేశారు. 2035 నాటికి భారత చమురు వినియోగం రోజుకు సుమారు 8 మిలియన్ బ్యారెళ్లకు చేరుకుంటుందని, ఇది ప్రస్తుత స్థాయిలో పోలిస్తే 44 శాతం అధికమని ఆయన అన్నా రు. ఇదే సమయంలో, అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) అంచనాల ప్రకారం, ప్రపంచ చమురు డిమాండ్ కేవలం 5 శాతం మాత్రమే పెరుగుతుందని సెచిన్ అన్నారు. దీంతో రాబోయే రోజుల్లో చమురు మార్కెట్‌లో భారత్ అత్యంత కీలక వృద్ధి కేంద్రంగా మారబోతున్నట్లు చెప్పారు. 2022 ఏప్రిల్ ననుంచి రష్యా నుంచి భారత్, చైనాలు చమురు దిగుమతి చేసుకోవడం వల్ల గణనీయంగా ఆర్థిక ప్రయోజనం పొందాయని సెచిన్ వెల్లడించారు. ఈ లాభాల విలువ 40 బిలియన్ డాలర్లకు పైగా ఉంటుందని అన్నారు. రస్యాతో కొనసాగుతున్న ఇంధన భాగస్వామ్యం వల్ల స్థిరమైన సరఫరా సాధ్యమైందని, ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థలో రష్యాను పెట్టడం సాధ్యం కాదని తెలిపారు. హార్ముజ్ జలసంధి ద్వారా జరిగే చమురు, గ్యాస్ రవాణాకు అంతరాయం కలిగితే, ప్రపంచ వ్యాప్తంగా ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉంటుదని సెచిన్ హెచ్చరించారు. ముఖ్యంగా భారత్, ఆగ్నేయాసియా దేశాలు ఈ ప్రభావాన్ని ఎదుర్కొంటాయని అన్నారు. ఇంధన సంక్షోభం కారణంగా ఎరువుల ధరలు పెరగడం ద్వారా ఆహార ధరలపై కూడా తీవ్ర ప్రభావం పడొచ్చని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments

Close Menu