Ad Code

నోవా 2 నియో 5 జీ, నోవా 2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల : జూన్ 26 నుంచి అమ్మకాలు ప్రారంభం

దేశీయ మార్కెట్లో స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ Ai+  నోవా  సిరీస్‌ లో భాగంగా నోవా 2 నియో 5 జీ, నోవా  2 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్లను విడుదల చేసింది. ఇవి జూన్ 26 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్ ద్వారా అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 16 ఆధారిత NxtQuantum OS పై పనిచేస్తాయి. NxtPrivacy Dashboard, AI Key వంటి ప్రత్యేక ఫీచర్లను కూడా కలిగి ఉన్నాయి. నోవా 2 నియో 5 జీ ప్రధానంగా మొదటిసారి స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేసే వినియోగదారులు, బడ్జెట్ ఫోన్ కోరుకునే వారికి అనువుగా రూపొందించబడింది. దీనిలో 6.74 అంగుళాల HD+ 120Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్, 48MP సోనీ IMX582 ప్రధాన కెమెరా, 8MP సెల్ఫీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 18W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. అలాగే IP65 రేటింగ్, సైడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, 3.5mm ఆడియో జాక్ వంటి ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి. నోవా 2 ప్రో 5 జీలో 6.9 అంగుళాల FHD+ 144Hz డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 7100 ప్రాసెసర్, 48MP ప్రధాన కెమెరాతో పాటు 8MP అల్ట్రా వైడ్ లెన్స్, 13MP ఫ్రంట్ కెమెరా, స్టీరియో స్పీకర్లు, 6000mAh బ్యాటరీ, 33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ప్రత్యేకంగా కస్టమైజ్ చేయగలిగే రియర్ నోటిఫికేషన్ లైట్స్ కూడా ఉన్నాయి. నోవా 2 నియో 5 జీ 4GB+128GB వేరియంట్ రూ.12,999కు, 6GB+128GB వేరియంట్ రూ.13,999కు అందుబాటులో ఉంటుంది. నోవా 2 ప్రో 5 జీ 6GB+128GB వేరియంట్ ధర రూ.15,999 కాగా, 8GB+128GB వేరియంట్ ధర రూ.17,999గా నిర్ణయించారు. అన్ని ప్రధాన క్రెడిట్, డెబిట్ కార్డులపై రూ.1,000 ఇన్‌స్టంట్ బ్యాంక్ డిస్కౌంట్ కూడా లభించనుంది. 

Post a Comment

0 Comments

Close Menu