బ్రిటన్ లో 16 లోపు పిల్లలు సోషల్ మీడియా యాప్స్ వాడకంపై నిషేధం

బ్రిటన్ లో 16 ఏళ్ల లోపు పిల్లలు సోషల్ మీడియా యాప్స్ ఉపయోగించకుండా త్వరలో పూర్తి నిషేధం విధించనున్నట్లు ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రకటించారు. వచ్చే ఏడాది వేసవి కాలం నాటికి ఈ చట్టాన్ని పక్కాగా అమలులోకి తీసుకురావడానికి అక్కడి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఈ కఠినమైన నిర్ణయం వెనుక ఒక దేశ ప్రధాని బాధ్యతతో పాటు ఒక తండ్రి ఆవేదన కూడా ఉందని కీర్ స్టార్మర్ చెప్పుకొచ్చారు. పిల్లల మానసిక ఆరోగ్యం, వారి సంతోషం కంటే తమకు ఏదీ ముఖ్యం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన, కోట్లలో వ్యాపారం చేసే టెక్ కంపెనీలను నియంత్రించడం అంత సులభం కాదని ఆయన ఒప్పుకున్నారు. కానీ, సమాజ హితం కోసం, రేపటి తరం భవిష్యత్తు కోసం ఇలాంటి మార్పులు ఖచ్చితంగా అవసరమని ఆయన గట్టిగా సమర్థించుకున్నారు. ఈ కొత్త చట్టంలో పిల్లల అవసరాలను కూడా పరిగణనలోకి తీసుకున్నారు. రోజువారీ కమ్యూనికేషన్ కోసం ఉపయోగపడే వాట్సాప్ వంటి పర్సనల్ మెసేజింగ్ యాప్‌లకు ఈ నిషేధం నుండి మినహాయింపు ఇచ్చారు. పబ్లిక్‌గా కంటెంట్ షేర్ చేసే, రీల్స్, వీడియోలతో అడిక్ట్ చేసే సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపైనే ఈ ఆంక్షలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అపరిచితులు సులభంగా పిల్లలను కాంటాక్ట్ చేసే అవకాశం ఉన్న ఆన్‌లైన్ గేమింగ్ సర్వీసులు, లైవ్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌ల విషయంలో బ్రిటన్ ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించనుంది. వీటి కోసం ప్రత్యేకంగా ‘వయస్సు ధ్రువీకరణ’ విధానాన్ని తీసుకురానున్నారు. 


Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం