నైజర్ రాజధాని నియామేలోని విమానాశ్రయంపై ఉగ్ర దాడి జరిగింది. దియోరి హమాని అంతర్జాతీయ విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడి చేయడంతో 13 మంది మృతి చెందారు. ఈ దాడికి పాల్పడింది తామేనని అల్‌ఖైదా అనుబంధ సంస్థ జమాత్ నుస్రత్ అల్ ఇస్లాం వల్ ముస్లమిన్ ప్రకటించింది. తీవ్రవాదుల దాడిలో మృతి చెందిన వారికి సంఘీభావాన్ని తెలియజేస్తున్నామని, ఆ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అల్జీరియా విదేశాంగ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పొరుగు దేశమైన నైజర్ భద్రత, అస్థిత్యాన్ని దెబ్బతీసే లక్ష్యంతోనే దారుణమైన దాడి జరిగిందని, ఆ దేశానికి అల్జీరియా గట్టి మద్దతుగా నిలుస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడంలో నైజీరియన్ దేశానికి తాము మద్దతుగా ఉంటామని, ఉమ్మడి ప్రాంతీయ పరిధిలోని శాంతిభద్రతలకు ముప్పులను ఎదుర్కోవడానికి ద్వైపాక్షిక, ప్రాంతీయ సహకారాన్ని బలోపేతం చేయడానికి తాము కలసి వస్తామని అల్జీరియా తెలిపింది.
0 Comments