Ad Code

11,000 వోల్ట్ ల కరెంట్ తీగలపై నిద్రపోయిన తాగుబోతు : వీడియోలు సోషల్ మీడియాలో వైరల్

త్తరప్రదేశ్ మహారాజ్‌గంజ్ జిల్లా పర్సఖుర్ద్ గ్రామంలో మద్యం మత్తులో ఉన్న ఒక వ్యక్తి 11000 వోల్ట్ ల విద్యుత్ స్తంభంపై నిద్రపోయి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అదృష్టవశాత్తూ ఆ సమయంలో విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో ప్రాణాపాయం తప్పింది. పోలీసులు, విద్యుత్ శాఖ సిబ్బంది గంటల తరబడి శ్రమించి అతడిని సురక్షితంగా కిందకు దించారు. మద్యం మత్తులో ఉన్న ఆ వ్యక్తికి ఏం జరుగుతుందో తెలియని స్థితిలో విద్యుత్ స్తంభం ఎక్కాడు. 11000 వోల్ట్ ల విద్యుత్ తీగలపై ఎంచక్కా పడుకుని హాయిగా నిద్రపోయాడు. చుట్టుపక్కల ప్రజలు అతడిని చూసి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఏ చిన్న పొరపాటు జరిగినా ప్రాణాలు గాల్లో కలిసే అవకాశం ఉన్నప్పటికీ, అతను మాత్రం ఏమీ ఎరగనట్లుగా నిద్రపోవడం గమనార్హం. స్తంభంపై వ్యక్తిని చూసిన స్థానికులు వెంటనే విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అధికారులు వెంటనే ఆ ప్రాంతంలో విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీనివల్ల పెద్ద ప్రమాదం తప్పింది. అప్పటికే ఆ వ్యక్తి నిద్రలేచి స్తంభంపైనే కూర్చుని ఉన్నాడు. పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని కిందకు దిగమని బతిమిలాడారు. సుమారు 40 నిమిషాల పాటు కొనసాగిన ప్రయత్నాల తర్వాత అతను సురక్షితంగా కిందకు వచ్చాడు. మద్యం మత్తులో ఉన్న వ్యక్తిని అధికారులు విచారించి, ఎటువంటి కేసులు నమోదు చేయకుండా కుటుంబ సభ్యులతో పంపించివేశారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu