హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్-5 పరిధిలోని దేవరకొండ బస్తీకి చెందిన మహ్మద్ షాదాబ్ (19) అనే యువకుడు బైక్‌పై ప్రమాదకరమైన విన్యాసాలు చేస్తూ, ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. దీనిపై సమాచారం అందుకున్న బంజారాహిల్స్ పోలీసులు నిందితుడిని గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం షాదాబ్ గత కొంతకాలంగా బంజారాహిల్స్ పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారులపై అర్థరాత్రి వేళల్లో బైక్‌ల సైలెన్సర్లు తీసేసి, ప్రమాదకరమైన రీతిలో బైక్ స్టంట్లు చేస్తున్నాడు. తన బైక్ విన్యాసాలను స్నేహితులతో మొబైల్ ఫోన్లలో రికార్డ్ చేయించి, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమాలలో రీల్స్ రూపంలో అప్‌లోడ్ చేస్తూ వస్తున్నాడు. ఈ ప్రమాదకర స్టంట్ల వల్ల అటు తను ప్రమాదంలో పడటమే కాకుండా, రోడ్డుపై వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారుల ప్రాణాలకు కూడా ముప్పు వాటిల్లుతోంది.
0 Comments