Ad Code

పవన్ ఖేరాకు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు


కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరాకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ, ఆయన భార్య రింకీ భుయాన్ శర్మకు సంబంధించిన వివాదాల నేపథ్యంలో తలెత్తిన పాస్‌పోర్ట్ ఉల్లంఘన కేసులో అత్యున్నత న్యాయస్థానం ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. పాస్‌పోర్ట్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి నమోదైన కేసును విచారించిన సుప్రీంకోర్టు, పవన్ ఖేరాకు బెయిల్ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా ఓ పత్రికా సమావేశంలో పవన్ ఖేరా మాట్లాడుతూ అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ సతీమణి రినికి భుయాన్ శర్మకు చెందిన కంపెనీకి పీపీఈ కిట్ల సరఫరాలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు చేశారు. అదేవిధంగా ఆమె వివిధ దేశాల పాస్‌పోర్టులు ఉన్నాయని ఆరోపించారు. దీంతో రినికి భుయాన్ శర్మ తన ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని ఆమె కోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో అరెస్టు కాకుండా ఉండేందుకు ఖేరా దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీం కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ దర్యాప్తునకు సహకరించాలని ఆదేశాలు జారీ చేసింది. 

Post a Comment

0 Comments

Close Menu