Ad Code

అన్నం పెట్టలేదని కోపంతో భార్యపై భర్త కొడవలితో దాడి భర్త


ఆంధ్రప్రదేశ్ లోని పోలవరం జిల్లా దేవీపట్నం మండలం మెట్టగూడెం గ్రామంలో రాజేంద్ర ప్రసాద్ తన భార్య పాపాయమ్మను అన్నం పెట్టమని అడిగాడు. ఆ సమయంలో భార్యాభర్తల మధ్య మాటా మాటా పెరిగి గొడవ మొదలైంది. కోపం పెంచుకున్న భర్త ఇంట్లోని కొడవలి తీసుకుని భార్యపై విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన పాపాయమ్మ రక్తపు మడుగులో పడి ఉండటం చూసి ఆమెను వెంటనే గోకవరం ఆసుపత్రికి తరలించగా, పరిస్థితి విషమంగా ఉండటంతో రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం ఆమె అక్కడ ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే గ్రామానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు రాజేంద్ర ప్రసాద్‌పై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు. 

Post a Comment

0 Comments

Close Menu