బెల్జియంలో పాఠశాల చిన్నారులతో వెళ్తున్న మినీ స్కూల్ బస్సును వేగంగా వచ్చిన రైలు బలంగా ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో చిన్నారులతో సహా పలువురు అక్కడికక్కడే మరణించినట్లు అంతర్జాతీయ మీడియా వర్గాలు, స్థానిక అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. ఉత్తర బెల్జియం పరిధిలోని 'బుగ్గెన్‌హౌట్' అనే గ్రామీణ ప్రాంతంలో ఉన్న ఓ రైల్వే లెవెల్ క్రాసింగ్ వద్ద ఈ ఊహించని దారుణం చోటుచేసుకుంది. ఈ ప్రమాద తీవ్రత ఆ మినీ బస్సు పూర్తిగా ధ్వంసమై రైల్వే ట్రాక్ పక్కన ఉన్న రోడ్డుపై తలకిందులుగా పడిపోయింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే సహాయక సిబ్బంది, ఎమర్జెన్సీ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి. ప్రమాద స్థలంలో తాత్కాలిక టెంట్లు ఏర్పాటు చేసి సహాయక చర్యలను ముమ్మరం చేశారు. ప్రమాదం జరిగిన సమయంలో ఆ బస్సులో ఏడుగురు విద్యార్థులు, ఓ సూపర్‌వైజర్, డ్రైవర్ ఉన్నట్లు స్థానిక పోలీసు ప్రతినిధి మీడియాకు వెల్లడించారు.
0 Comments