అన్నాడీఎంకేకు ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా


న్నాడీఎంకేకు చెందిన వేలుమణి వర్గం ఎమ్మెల్యేలు  సత్యభామ, మరగాథం, జయకుమార్ రాజీనామా చేశారు. వారు స్పీకర్ ను కలిసి తమ రాజీనామా లేఖలను అందజేశారు. బలపరీక్ష వేళ ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు విజయ్ కు మద్దతు తెలిపారు. ఈ ముగ్గురు ఎమ్మెల్యేలు టీవీకే మంత్రి అదవ్ అర్జున్ తో భేటీ అయ్యారు. వీరు టీవీకేలో చేరతారని సమాచారం. అసెంబ్లీ స్పీకర్ జేసీడీ ప్రభాకర్‌ను కలిసిన అనంతరం తిరుగుబాటు వర్గానికి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు రాజీనామా చేయడంతో ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే)కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఈ తిరుగుబాటు శాసనసభ్యులు మంత్రి ఆదవ్ అర్జునను కూడా కలిశారు. త్వరలో ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కజగం (టీవీకే)లో ఈ ముగ్గురు చేరతారని భావిస్తున్నారు.

Comments

Popular posts from this blog

ANU SCRIPT MANAGER 7.0 (With Installation Guide & Using)

How to Play flipkart Snakes & Ladders Game?

అంబులెన్స్‌ను ఢీకొన్న ప్రైవేట్ ట్రావెల్ బస్సు : ఇద్దరి దుర్మరణం