Ad Code

తెలుగురాష్ట్రాలపై పెరిగిన ఉష్ణోగ్రతలు


తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ప్రధాన నగరాల్లో 41 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కడపలో అత్యధికంగా 42.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవగా రెంటచింతల, కర్నూలు, చిత్తూరులో 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. హైదరాబాద్, నల్లగొండ, నిజమాబాద్, కరీంనగర్‌లలో 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యింది. ఎండలు మండిపోతుండడంతో ప్రజలెవ్వరూ ఏదైనా అత్యవరమైతే తప్ప ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకూ బయిటకి రాకూడదని నిపుణులు సూచిస్తున్నారు. ఒకవేళ బయిటకి వెళ్లినా తగిన జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు.

Post a Comment

0 Comments

Close Menu