ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీకి డ్రైవర్ కె.విజయ్ ధాము


మిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో రాయపురం నియోజకవర్గం నుంచి తమిళగ వెట్రి కళగం తరపున పోటీ చేసిన ఆటో డ్రైవర్ కె.విజయ్ ధాము, రాజకీయ ఉద్దండులను ఓడించి అసెంబ్లీలోకి అడుగుపెడుతున్నారు. రాయపురం అంటే ఏఐఏడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి డి.జయకుమార్‌కు కంచుకోట. 1991 నుంచి అక్కడ ఆయనదే హవా. అటువంటి నేతను విజయ్ ధాము మూడో స్థానానికి నెట్టేయడం విశేషం. ఈ ఎన్నికల్లో విజయ్ ధాము 55,000 పైచిలుకు ఓట్లు సాధించి, 14,000 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. డీఎంకే తరఫున బరిలో నిలిచిన సుబైర్ ఖాన్ రెండో స్థానంలో,  ఏఐఏడీఎంకే తరఫున పోటీలో నిలిచిన జయకుమార్ 18,000 ఓట్లతో మూడో స్థానానికి పరిమితమయ్యారు. విజయ్ ధాము గత కొంతకాలంగా ‘విజయ్ మక్కల్ ఇయక్కం’ (అభిమాన సంఘం)లో చురుగ్గా పనిచేస్తున్నారు. అభ్యర్థుల ప్రకటన సమయంలో పార్టీ అధినేత విజయ్‌ను హత్తుకుని ధాము కన్నీళ్లు పెట్టుకున్న దృశ్యం అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఆ భావోద్వేగమే నేడు రాయపురం ఓటర్లను కదిలించింది. “మేము కొత్త వాళ్లం కావచ్చు, కానీ ఇన్నేళ్లుగా అభిమాన సంఘాల ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల మధ్యే ఉన్నాం” అని ధాము తన ప్రచారంలో చెప్పుకొచ్చారు. ప్రతి నియోజకవర్గంలోనూ అభ్యర్థి కంటే తన ముఖమే ప్రధానంగా కనిపించేలా విజయ్ ప్రచారాన్ని రూపొందించారు. దీనికి తోడు ధాము తన మేనిఫెస్టోలో మత్స్యకార సామాజిక వర్గానికి ఇచ్చిన హామీలు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలు ఓటర్లను విపరీతంగా ఆకర్షించాయి. సిట్టింగ్ ఎమ్మెల్యేను మార్చి కొత్త అభ్యర్థిని తెచ్చిన డీఎంకేకు, తన సొంత ఇలాకాలో పట్టు కోల్పోయిన ఏఐఏడీఎంకేకు ఈ ఫలితం పెద్ద హెచ్చరికగా మారింది. ఒక సామాన్యుడిగా ఆటో స్టాండ్ నుంచి అసెంబ్లీ వరకు విజయ్ ధాము సాగించిన ఈ ప్రయాణం, తమిళనాడు రాజకీయాల్లో టీవీకే పార్టీ తీసుకొచ్చిన ‘మార్పు’కు నిదర్శనంగా నిలిచిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains