Ad Code

ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ సాధారణ వాటాదారులకు ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ ఓపెన్‌ ఆఫర్‌


ఆర్‌బీఎల్‌ బ్యాంక్‌ సాధారణ వాటాదారులకు దుబాయ్‌ సంస్థ ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ ఓపెన్‌ ఆఫర్‌ ప్రకటించింది. తద్వారా 26 శాతం వాటాకు సమానమైన దాదాపు 41.56 కోట్ల షేర్లను కొనుగోలు చేయనుంది. షేరుకి రూ. 280 ధరలో చేపట్టిన ఆఫర్‌ జూన్‌ 12న ముగియనుంది. ఈ నెల మొదట్లో ఆర్‌బీఎల్‌లో 74 శాతం వాటా కొనుగోలుకి ఎమిరేట్స్‌ ఎన్‌బీడీకి ఆర్థిక శాఖ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ప్రతిపాదిత 3 బిలియన్‌ డాలర్ల (రూ. 26,850 కోట్లు) డీల్‌ దేశీ బ్యాంకింగ్‌ పరిశ్రమలో అత్యంత భారీ పెట్టుబడికాగా, బ్యాంక్‌ తదుపరి వృద్ధికి నిధులు ఉపయోగపడనున్నట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. గత నెలలో ఆర్‌బీఐ సైతం ఇందుకు అనుమతించిన సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu