చండీగఢ్‌కు చెందిన నటి ఫ్లోరా సైనీ ప్రముఖ నిర్మాత గౌరంగ్ దోషితో ప్రేమలో ఉన్న సమయంలో ఎదుర్కొన్న చేదు అనుభవాలను పంచుకున్నారు. "అతని ప్రేమలో పడిన కొద్ది రోజుల్లోనే అతను ఎంత కృరుడో అర్థమైంది. కానీ అప్పటికే సమయం మించిపోయింది. అతను నా ప్రైవేట్ భాగాలపై తన్నేవాడు, నా ముఖాన్ని బాక్సింగ్ బ్యాగ్‌లా వాడుతూ కొట్టేవాడు. ఎవరికీ ఫోన్ చేయనిచ్చేవాడు కాదు, సినిమాల్లో నటించవద్దని ఆంక్షలు పెట్టేవాడు. అతని కోసం అందరినీ వదిలేసి వెళ్తే, నాపై ఇలాంటి దౌర్జన్యం చేశాడు. ఎందుకు కొడుతున్నాడో కూడా తెలిసేది కాదు. ఎక్కడికైనా వెళ్ళిపోతానంటే, నన్ను నా తల్లిదండ్రులను చంపేస్తానని బెదిరించేవాడు. 14 నెలలు చీకటిలోనే బతికాను. ఒకరోజు చిత్రహింసలు ఎక్కువయ్యాయి, అతను నా కడుపులో తన్నాడు. ఎలాగోలా అక్కడి నుండి తప్పించుకొని ఇల్లు వదిలి పారిపోయాను" అని ఫ్లోరా రాసుకొచ్చారు. తన గాయాలకు సంబంధించిన ఫోటోలను కూడా ఆమె షేర్ చేశారు. అక్కడి నుండి పారిపోయి వచ్చిన ఫ్లోరా, ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కోలుకున్న తర్వాత మళ్లీ నటనను ప్రారంభించారు. ఇటీవల విడుదలైన బాలీవుడ్ చిత్రం 'భేడియా'లో కూడా ఆమె నటించారు. "నేను ఇప్పుడు సంతోషంగా ఉన్నాను, నాకు మళ్లీ ప్రేమ దొరికింది. ఆనాడు పోలీసుల దగ్గరికి వెళ్లినా మొదట వారు నమ్మలేదు, కానీ చివరికి రాతపూర్వక ఫిర్యాదు చేశాను. చీకటి ఎంతగా అలుముకున్నా, చివర్లో కాంతి రేఖ దొరుకుతుంది" అని ఆమె పేర్కొన్నారు.
0 Comments