చైనాలోని లియుషెన్యూ బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించి 82 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది ఆచూకీ గల్లంతైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు అక్కడి అధికారిక మీడియా ఈ వివరాలను వెల్లడించింది. షాన్సీ ప్రావిన్స్‌లోని టోంగౌజ్ గ్రూప్‌నకు చెందిన లియుషెన్యూ బొగ్గు గనిలో శుక్రవారం రాత్రి 7:30 గంటలకు గ్యాస్ లీకై పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో గనిలో 247 మంది కార్మికులు విధుల్లో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే రెస్క్యూ బృందాలు ఘటనా స్థలానికి చేరుకొని.. సహాయక చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో కొందరిని రక్షించినట్లు సమాచారం.
0 Comments